టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం

by Anukaran |   ( Updated:2023-07-28 04:46:20.0  )
Bodhan MLA Shakeel
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ వర్సెస్ నిజామాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌ల ఆడియో సంభాషణ లీక్ అయింది. ఆ ఆడియోలో షబాజ్ అహ్మద్‌‌ను ఎమ్మెల్యే బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎమ్మెల్యే షకీల్ మంగళవారం బోధన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీకి ఎంఐఎం బీ టీంగా పని చేస్తోందని విమర్శించారు. దీనిపై స్పందించిన ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యే షకీల్ గతంలో బీజేపీ నాయకులతో ఉన్న ఫొటోలు, ఇటీవల ఎంపీ అరవింద్‌ను కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. బుధవారం ఎంఐఎం నాయకుడు షబాజ్ అహ్మద్‌కు ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, పార్టీ బేస్‌గా సాగిన సంభాషణ చివరకు బూతు పురాణం వరకు వెళ్లింది. ఈ ఆడియో సైతం నిజామాబాద్, బోధన్‌లో వైరల్ అయింది.

Advertisement

Next Story