నిరసన గళం ఢిల్లీకి వినబడాలి.. రైతులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు

by Ramesh Goud |   ( Updated:2021-12-18 06:26:53.0  )
నిరసన గళం ఢిల్లీకి వినబడాలి.. రైతులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు
X

దిశ, పర్వతగిరి: రాజకీయ లబ్ది కోసమే బీజేపీ రైతులను అడ్డు పెట్టుకొని కపట నాటకాలు ఆడుతోందని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల 20న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని మండలాలు, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి మన నిరసన గళాన్ని ఢిల్లీకి వినపడేలా చేయాలని కోరారు.

రైతును రాజు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో రైతన్నలకు అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదునాం చేయాలని చూస్తోందని అన్నారు. యాసంగిలో రైతులు వరి వేసి నష్టపోవద్దని, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story