కేంద్రంపై టీఆర్ఎస్ శ్రేణుల పోరు.. నిరసనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు

by Shyam |
కేంద్రంపై టీఆర్ఎస్ శ్రేణుల పోరు.. నిరసనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మరోపక్క మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంలోని గ్రామాల్లో చావు డప్పు కార్యక్రమంతో పాటు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ధాన్యం కొనుగోలు చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో బీజేపీని బొంద పెడతామని హెచ్చరించారు.

సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, మహబూబాబాదులో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చిట్యాలలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, హనుమకొండ ధర్మసాగర్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు, నాగర్ కర్నూల్‌లో ఎంపీ రాముడు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, నారాయణపేటలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో టీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed