- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS రిసార్ట్ రాజకీయం.. శామీర్‌పేట్ టూ గోవా, పూణే టూర్లకు లోకల్ లీడర్లు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల క్యాంప్‌ను మార్చేసింది. శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్ నుండి సమీపంలోని వెలమ సంఘం ఫంక్షన్ హాల్‌కు తరలించారు. మంగళవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకూ లియోనియా రిసార్ట్స్‌లో ఉన్న వారిని హుటాహుటిన రెండు బస్సుల్లో ఫంక్షన్ హాల్‌కు తరలించారు. లియోనియా రిసార్ట్స్‌కు ఇప్పటివరకే అద్దె చెల్లించడంతో ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను శనివారం హైదరాబాద్ చేరుకోవాలని జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వీరంతా ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న తర్వాత సాయంత్రం క్యాంప్ టూర్ స్టార్ట్ కానుంది. గోవా, పూణే, బెంగుళూరుల్లో 12 రోజుల పాటు ఈ టూర్ సాగనుంది. డిసెంబర్ 10వ తేదీన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల వద్దకు వీరిని తరలించేందుకు ఏర్పాటు చేశారు.