- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరుప్పులలో భారీ నిరసన.. కేంద్రం దిష్టి బొమ్మ దగ్దం..
దిశ, దేవరుప్పుల: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దేవరుప్పుల మండలంలోని ప్రధాన చౌరస్తాలో రైతులు ప్రధాని మోడీ పాడెకట్టి, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, జెడ్పీటీసీ వల్ల భార్గవి సుందర రామిరెడ్డి, ఎంపీపీ భస్వ సావిత్రి మల్లేశం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వ హయాంలో రైతులు రోడ్డెక్కడం విడ్డూరం అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కొరకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పరిపాలన చేతగాని భాజపా, రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని విమర్శంచారు. రాష్ట్ర భాజపా నేతలు ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతులను వంచనకు గురి చేస్తున్న భాజపా ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఈదునూరి రమాదేవి, నర్సింహారెడ్డి, రాజన్న నాయక్, బిల్లా అంజమ్మ యాదవరెడ్డి, మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు జోగు సోమనర్సయ్య, ఇతర సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.