- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దిశ’ కథనానికి స్పందన.. థ్యాంక్స్ చెప్పిన TRS నేతలు, కార్యకర్తలు
X
దిశ, భద్రాచలం : అధికార పార్టీకి కార్యాలయాలు కరువు శీర్షికన గురువారం ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి టీఆర్ఎస్ నాయకులు స్పందించారు. భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశమైన ఈ వార్తని ఇతర పార్టీల వారితోపాటు టీఆర్ఎస్ కేడర్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు స్పందించారు.
అధికార పార్టీకి కార్యాలయం లేకపోవడం ప్రధాన వెలితిగా పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు స్పందించి త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తామని పోస్టు చేశారు. దీంతో, కార్యాలయం లేనందున అసంతృప్తిగా ఉన్న పార్టీ కేడర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలం తమ మదిలో దాగిన అంశాన్ని పత్రికా ముఖంగా వెలుగులోకి తెచ్చిన ‘దిశ’కి టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఫోన్లు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Read more: కేసీఆర్ నన్ను‘ రాజేందర్ మాదిగ’ అని పిలిచేవారు : ఈటల షాకింగ్ కామెంట్స్
Advertisement
Next Story