- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిష్టానం పిలుపును ఖాతర్ చేయని టీఆర్‌ఎస్ నాయకులు
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ, చాలా జిల్లాల్లో ఆ పిలుపును ఆ పార్టీ నాయకులే బేఖాతరు చేశారు. కేసీఆర్ మాత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా జెండా ఆవిష్కరించి వెళ్ళిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రక్తదానం చేశారు. కానీ, జిల్లాల్లో మాత్రం గందరగోళంగా సాగింది. హడావిడి ఎక్కువ కనిపించింది. కరోనా నియంత్రణలో భాగంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనలను గాలికొదిలేశారు. పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
కొన్ని ప్రాంతాలోనైతే నువ్వా నేనా అన్నట్లు జెండా ఎగురవేయడానికి ఘర్షణ పడ్డారు. పెద్దపల్లిలో ఇలాంటి ఆధిపత్య పోరుతో చివరకు జెండాకు కట్టిన తాడే తెగిపోయింది. కొన్ని చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. గుంపులు గుంపులుగా కార్యకర్తలు పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిర్వహించిన కార్యక్రమం చూస్తే సోషల్ డిస్టెన్స్ అనే నిబంధన ఉన్నట్లు గుర్తుకే రాదు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు ముఖానికి కట్టుకున్న మాస్క్ లపై టీఆర్ఎస్ లోగో, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను ముద్రించుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా వైరస్ నియంత్రణకు స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి చెప్తూ ఉంటే ఆ పార్టీ నాయకులే తుంగలో తొక్కారు.
tags : Telangana, TRS, Formation Day, KCR, KTR