- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కావడానికి ప్రధాన కారణం ఇతనే'
X
దిశ, చేవెళ్ల: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఏకగ్రీవంగా విజయం సాధించడంతో శనివారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు మహేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారన్నారు. అధికారికంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story