వారి ప్రచారం ఆ పదవి కోసమే..

by Shyam |
వారి ప్రచారం ఆ పదవి కోసమే..
X

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం పీసీసీ పదవి కోసమే కానీ ప్రజల సంక్షేమం కోసం కాదని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్పల్లి ,గువ్వ లెగి గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నాయకులు ఆత్మ స్టైర్యాన్ని కోల్పోతున్నారని తెలిపారు. అందుకే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల తరువాత వారు ఆత్మ స్టైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వస్తుందని వంటేరు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో ప్రభుత్వ సంక్షేమాలు పొందని ఇండ్లు ఉంటే చూపించాలని ఉత్తమ్, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు.

Advertisement

Next Story