- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ నీకు సిగ్గుందా..?: మోత్కుపల్లి
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ లో ఈటలది గెలుపు కాదు వాపే అని, కాంగ్రెస్ కలయికతో ఈటల గెలిచాడని ఆయన ఆరోపించాడు. పార్టీనే అమ్ముకున్న వ్యక్తి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని, ఇట్లనే వదిలేస్తే సోనియాగాంధీ కుటుంబాన్ని కూడా అమ్ముకుంటాడన్నారు. కాంగ్రెస్ ఓట్లను ఈటల కొనుక్కున్నాడని, ఈటల గెలుపులో నీతి ఉందా? అని మోత్కుపల్లి అన్నాడు.
‘బండి సంజయ్ డప్పు ఇక్కడ కాదు.. ఢిల్లీలో కొట్టాలి. దళితబంధు దేశం అంతా అమలయ్యే వరకు టీఆర్ఎస్ వెంటాడుతది. కేసీఆర్ కు దళితులమంతా అండగా ఉంటాం. బండి సంజయ్ చిల్లరగాని లెక్క తయారయ్యాడు. కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా దళితబంధు అమలు చేయాలి. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షలు జమ చేయాలి. దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది నా జాతి రక్షణ కోసం మాట్లాడుతున్నా. సీఎం కేసీఆర్ సహకారం లేకుండా బీజేపీ దేశంలో పాలన చేయలేదు. కేసీఆర్ ను టచ్ చేస్తా అంటున్నవ్ బండి సంజయ్.. నీకు సిగ్గుందా..?.. కేసీఆర్ ను టచ్ చేయడం అంటే ఏ రకంగా టచ్ చేస్తావో చెప్పరా బండి సంజయ్. దేశంలో రాక్షస పాలన జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా డప్పుల దండోరా ఊరూరా వేస్తాం’ అని మోత్కుపల్లి అన్నారు.
చూడాలి మరీ.. మోత్కుపల్లి వ్యాఖ్యలపై బండి సంజయ్, బీజేపీ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది.