- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రవెల్లి సభలో కాంగ్రెస్ కోవర్టులు దొరికేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఇంద్రవెల్లి దళిత దండోరా రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది. ఈ దండోరా విజయవంతం అవుతుందా, విఫలమవుతుందా అనే అంశం పక్కనపెడితే ఇరు పార్టీల నేతలు క్లారిటీకి రానున్నారు. కాంగ్రెస్ కోవర్టులెవ్వరో, పార్టీకి విధేయులెందరనే విషయం అంచనాకు రానుంది. దీంతో దళిత దండోరా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ పోరుబాటపై కాంగ్రెస్‌లోని కొంతమంది నేతలు వ్యతిరేకించారు. ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. కానీ, రేవంత్‌వర్గం ఆయన్ను బుజ్జగించింది. దీంతో ఆయన అలకవీడాడు. మరోవైపు టీపీసీసీ చీఫ్అంశంలో రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించిన జగ్గారెడ్డి ఇప్పుడు సభా బాధ్యతలను భుజానేసుకున్నారు. ఇలా పార్టీ నేతలంతా దళిత దండోరాను విజయవంతం చేసే పనిలో పడ్డారు. కానీ కొంతమంది నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం మాట కూడా మాట్లాడటం లేదు.
కోవర్టులను తేల్చేస్తారా
కాంగ్రెస్‌పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారనేది ఏడేండ్ల నుంచి ఆరోపణలున్నాయి. ఇటీవల ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం, ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంపై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కోవర్డు అయినందునే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంద్రవెల్లి నుంచి పోరుబాట పడుతున్నామని, దాదాపు 18 నియోజకవర్గాల్లో దండోరా మోగిస్తున్నామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఓ వైపు దళిత బంధును ప్రవేశపెట్టి, దళిత వర్గాల మద్దతు కూడగడుతుంటే కాంగ్రెస్దానికి బ్రేక్‌వేసే విధంగా దళిత దండోరాను చేపట్టింది. అయితే దళిత బంధుకు వ్యతిరేకం కాదంటూ చెప్పుతున్న టీపీసీసీ చీఫ్… రాష్ట్రమంతా వర్తింపచేయాలంటూ పేర్కొన్నారు. కేవలం శాంపిల్స్ మాదిరిగా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకుని, మిగిలిన దళితులందరినీ ఆశల్లో పెడితే వదిలిపెట్టమంటూ టీఆర్ఎస్కు వార్నింగ్ ఇచ్చారు.
కాగా దళిత దండోరాకు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు కదలివస్తారని, పార్టీ నేతలంతా అక్కడే ఉంటారని టీపీసీసీ గత వారం రోజుల నుంచి చెప్పుతోంది. పలు కమిటీలు కూడా నియమించారు. కానీ ఇప్పటి వరకు పలువురు ఎంపీలు, నేతలు, ఎమ్మెల్యేలు కూడా దానిపై మాట్లాడటం లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వీరయ్యతో సహా పలువురు నేతలు నోరెత్తడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తున్నారా.. మద్దతు ఇస్తున్నారా అనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇంద్రవెల్లికి వెళ్తారా లేదా అనేదే పార్టీలో ఇప్పుడు ప్రధాన చర్చ. అయితే దళిత దండోరాకు వెళ్లకుండా ఉండే వారిని అసంతృప్తులుగా.. కేసీఆర్ కోవర్టులుగా చూపించేందుకు టీపీసీసీ సన్నాహాలు చేస్తోంది. దీనికి భారీ స్కెచ్కూడా రూపొందించారని పార్టీ నేతలు చెప్పుతున్నారు.
గైర్హాజరు నేతలపై టీఆర్ఎస్ ఫోకస్
మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలపై ఫోకస్‌పెట్టిన టీఆర్ఎస్.. ఇంద్రవెల్లి సభకు వెళ్లకుండా ఉండే నేతలకు గాలం వేయాలని రెడీగా ఉంది. ఆ పార్టీలోని అసంతృప్తిని అనుకూలంగా మల్చుకుని, గులాబీ దళంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌నేతలకు టీఆర్ఎస్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్గాన్ని విభేదిస్తూ ఇంద్రవెల్లి సభకు వెళ్లకుండా ఉంటే వారు అధికార పార్టీకి చిక్కినట్టే. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీలకు ఇంద్రవెల్లి సభ కీలకంగా మారింది.