- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఓ సోమరిపోతు : బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో కరోనా వైరస్ అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ సోమరిపోతులగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని బండి విమర్శించారు. తెలంగాణ ప్రజలు కరోనాతో తీవ్ర అవస్థలు పడుతున్నారని.. గాంధీ ఆస్పత్రిలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం 800 నుంచి 1000 వెంటిలేటర్లు ఇచ్చిందని ఎంపీ బండి సంజయ్ గుర్తు చేశారు. గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదని.. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవచేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది విధులకు రావడానికి భయపడుతున్నారని ఆయన తెలిపారు. వైద్య సిబ్బందిలో భరోసా నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. వారికి అందిస్తున్న ఎన్-95 మాస్కుల్లో క్వాలిటీ లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నారన్న బండి సంజయ్.. ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.