పంచాయతీలను టీఆర్ఎస్ లూటీ చేస్తోంది: ఉత్తమ్

by Shyam |
పంచాయతీలను టీఆర్ఎస్ లూటీ చేస్తోంది: ఉత్తమ్
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌డెస్క్: పంచాయతీ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పంచాయతీలను టీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోందన్నారు. ట్రాక్టర్, ఎల్ఈడీలను వాళ్లు చెప్పిన ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ వైపు పార్టీ మారకపోతే ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు వ్యాపారాలుగా మారి పోయాని అన్నారు. తెలంగాణలో ప్రతి పల్లెలో కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని తెలిపారు. ఇంత పెద్ద పార్టీ తెలంగాణలో లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story