తీన్మార్ మల్లన్న ఓ అబద్ధం.. దళితుల బాగు కోసమే ‘దళిత బంధు’..

by Shyam |   ( Updated:2021-08-06 05:51:49.0  )
ganesh
X

దిశ, మేడ్చల్ టౌన్ : దళితులు బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పట్ల మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో దళితుల బతుకులు దారుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో దళితులకే కాకుండా అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందని వివరించారు. అదే విధంగా మేడ్చల్ మున్సిపాలిటీని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరూ చేయని పనులను నియోజకవర్గంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలోని పథకాలను చూసి నివ్వెరపోతున్నాయని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గురించి తెలుసుకోకుండా తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తొందరలోనే తీర్మాన్ మల్లన్న బాగోతం బయటపడుతుందని.. అప్పుడు ఎవరు దొంగో, ఎవరు దొరో తెలుస్తుందని వెల్లడించారు. దళిత బంధు పథకం అమలు తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు నియోజకవర్గ ప్రజలే బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed