టీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్య.. కారణాలివే!

by Sumithra |   ( Updated:2021-08-03 10:29:41.0  )
TRS councillor Pramila Goud
X

దిశ, పటాన్‌చెరు: ప్రజల కష్టాలు తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నించాల్సిన ఓ ప్రజాప్రతినిధి ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం మున్సిపాలిటీలోని బీరప్ప బస్తీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ ప్రమీల గౌడ్(45) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న సీఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తూ గత కొన్ని రోజులుగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ప్రమీల గౌడ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story