నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత

by Shyam |
నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత
X

నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోదన్ మండలం హున్సా గ్రామంలో సహకార సొసైటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం ఇరు వర్గాల నేతలు రాళ్లు రివ్వూకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. హున్సా సొసైటీలో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి‌కి 8 మంది, టీఆర్‌ఎస్ అభ్యర్థి‌కి 5 మంది మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Next Story