మెట్‌పల్లిలో ‘అయోధ్య’ లొల్లి.. కారు vs కమలం

by Anukaran |
మెట్‌పల్లిలో ‘అయోధ్య’ లొల్లి.. కారు vs కమలం
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ మెట్‌పల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మెట్‌పల్లిలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టి విద్యాసాగర్ రావు ఫెక్ల్సీని దగ్దం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా హుటాహుటిన అక్కడకు చేరుకుని బీజేపీ నాయకులను అడ్డుకున్నారు.

జగిత్యాల నుంచి మెట్‌పల్లికి చేరుకున్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులను కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు నెట్టి వేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పెట్టిన భారీకేడ్లు కూడా వారిని నిలువరించలేకపోయాయి. సమాచారం అందుకున్న జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Next Story