- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతుల’తోనా మీ ఆటలు.. ఒకరు ‘వరి’ వేయమంటే మరొకరు వద్దంటారు
దిశ, నకిరేకల్ : ఓ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని పాలిస్తున్నారు. మరో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ పాలకులు ఇద్దరికీ చట్టాలపై పూర్తి అవగాహన ఉంటుంది. ఇద్దరూ సమన్వయంతో ముందుకు వెళ్తూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పాలన సాగించాలి. కానీ “వరి” పై కిరికిరి చేస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మాట్లాడుతున్నారు. దీంతో రైతులు ఎటూ తేల్చుకోలేక నిస్సహాయ స్థితిలో మిన్నకుండి పోతున్నారు. రైతులు తమ భూమిలో పంటలు పండిస్తూ తమ పొట్ట నింపుకుంటారు. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు వరి సాగు వద్దని పిడుగులాంటి వార్త చెప్పడంతో అయోమయంలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వెన్నంటి ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి హామీ ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తున్నారు.
దీంతో రైతులు ఏ పంట సాగు చేయాలో తెల్చుకోలేక సతమతం అవుతున్నారు. రైతుల ఇబ్బందులను తొలగిస్తామని రాజకీయ ధర్నా చేస్తున్న తెరాస ప్రభుత్వం.. సరైన సమాధానం చెప్పకుండా కేవలం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాట్లాడుతూ రాజకీయ ధర్నాలు చేస్తుందన్నారు. అదే విధంగా భాజపా నాయకులు వడ్లు కొనుగోలు చేయాలంటూ చేసే పర్యటనలోనూ రాజకీయం ఉందంటూ రైతులు వాపోతున్నారు. కేవలం వచ్చే ఎన్నికల్లో అధికారం కోసమే ఇలాంటివి చేస్తున్నారు. రైతుల కోసం కాదంటూ కొందరు తమ మనసులోని మాటను బయటకు వెలిబుచ్చుతున్నారు. రెండు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్పా రైతులకు ఏమీ ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎటువంటి హామీ ఇస్తారో వేచి చూడక తప్పటం లేదు. సాగుకు అనువైన కాలం వెళ్ళిపోతున్న హామీ మాత్రం ఇవ్వక ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.