ఇదేం అచీవ్‌మెంట్ కార్తికేయ?

by Shyam |   ( Updated:2020-02-14 05:19:03.0  )
ఇదేం అచీవ్‌మెంట్ కార్తికేయ?
X

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ విషయమై కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ‘అందాల రాక్షసి సినిమా నుంచి లావణ్యకు నేను అభిమానిని. ఆమెతో సినిమా చేయడం గర్వంగా ఉంది. లావణ్యతో కలిసి నటించడం ఓ అచీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాను’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై కార్తికేయకు లావణ్య కృతజ్ఞతలు తెలిపింది. నీతో కలసి పనిచేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందని బదులిచ్చింది. అయితే, నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందించారు. కార్తికేయను ట్రోల్ చేస్తున్నారు. లావణ్యతో నటించడం అచీవ్‌మెంట్ ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. దిగ్గజ నటులు, కళాకారులతో నటించడం అచీవ్‌మెంట్‌గా భావించాలని సలహాలు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed