ఉన్నత విద్యా సంస్థల్లోకి గిరిజన విద్యార్థులు

by Shyam |
ఉన్నత విద్యా సంస్థల్లోకి గిరిజన విద్యార్థులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని పేరెన్నికగన్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభించడం పట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ గురుకుల విద్యా సంస్థలకు దేశవ్యాప్తంగానే లభించిన గుర్తింపుగా ఆమె అభివర్ణించారు. గురుకుల విద్యా సంస్థల్లో డిగ్రీ పూర్తిచేసుకున్న 36మంది గిరిజను విద్యార్థినీ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఆగాఖాన్ ఫౌండేషన్, అజీమ్‌జీ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, కళింగ ఇన్‌స్టిటూయట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ లాంటి అనేక సంస్థల్లో పీజీ కోర్సుల్లో అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. వారిని ఈ స్థాయికి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను, సహకారం అందించిన తల్లిదండ్రులను ఆమె అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed