- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘గిరిజన బాలికపై అత్యాచారం, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి’
దిశ, శేరిలింగంపల్లి : గిరిజన మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య( ఏఐడీఎఫ్ డబ్ల్యూ) డిమాండ్ చేసింది. మంగళవారం మియావూర్ ఎంఏ నగర్ లోని పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలు విమల మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం గ్రామం గుగులోతు తండాకు చెందిన గిరిజన మైనర్ బాలిక ఉషను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
దిశ ఘటనకు కారణమైన వారిని శిక్షించిన మాదిరిగానే, ఉష మరణనానికి కారణమైన వారిని శిక్షించాలన్నారు. అవసరమైతే చట్టంలో తగిన మార్పులు చేసైనా ఉషకు న్యాయం చేయాలని కోరారు. మంత్రిగా వ్యవహరిస్తున్న సత్యవతి రాథోడ్ కేవలం పత్రిక ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని అయినా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం దోషులను శిక్షించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐడీఎఫ్ డబ్ల్యూ సభ్యులు లావణ్య, సుల్తాన్ బేగం, శ్రీలత, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.