- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండుటెండలో మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు…
దిశ,మణుగూరు : కరకగూడెం మండల పరిధిలోని అశ్వాపురం పాడు గ్రామంలో ఆదివాసీలు తాగడానికి నీళ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. మంచినీటి కోసం సుమారు 2 కిలో మీటర్ల దూరం నుండి నీళ్ళు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో త్రాగడానికి నీరు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు. తుతు మంత్రంగా మిషన్ భగీరథ పైప్ లైన్స్ వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు మిషన్ భగీరథ అధికారులు అలవాటు పడి పైప్ లైన్స్ ని సరిగా పట్టించుకోకుండా, అశ్వాపురం పాడు గిరిజనులను చిన్న చూపు చూశారని గ్రామస్థులు వెలవెలబోతున్నారు.
మండుటెండలో చిన్న పిల్లల్ని ఎత్తుకొని నీళ్ల కోసం వెళ్లి వస్తున్న ఆ మహిళను చూస్తే ఎవరి గుండె అయినా కరగాల్సిందే అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు తెలిసి, తెలియనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. తమ గ్రామానికి తాగు నీరు లేక ఒక భాద అయితే,కరెంటు సౌకర్యం లేక రాత్రి సమయంలో పాములు,తేళ్ల బెడద ఉండడంతో భయంభయంగా ఉండాల్సి వస్తుందని గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరు అవ్వుతున్నారు.ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేక,ప్రాణాలు మార్గ మధ్యలోనే పోతున్నాయని గిరిపుత్రులు రోధిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోండి, కాపాడండి అని ప్రజలు ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు.