- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు పతాకాలు సాధించిన మన్యం క్రీడాకారులు
దిశ, అశ్వారావుపేట టౌన్: జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరిపుత్రులు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీకి చెందిన గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. పండువారి గూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకులు కొర్రి జగదీష్ ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ.. మడకం లక్ష్మణస్వామి సత్తుపల్లి జేవిఆర్ కళాశాలలో బీఏ డిగ్రీ విద్యనభ్యసిస్తున్నారు. వీరిద్దరూ మొదటి నుంచి వాలీబాల్ ఆటలో ప్రతిభ చూపుతుండటంతో ఈ నెలలో గోవాలో నిర్వహించిన నేషనల్ యూత్ గేమ్స్ ఛాంపియన్ షిప్ 2021 కు ఎంపికయ్యారు. ఈ పోటీలో పాల్గొన్న కొర్రి జగదీష్, మడకం లక్ష్మణస్వామిలు ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మోడల్స్ ను సాధించారు.
అయితే ఇంతటి ప్రతిభావంతులు గోవా వెళ్లేందుకు వీరి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్, టీడీపీ నేత కట్రం స్వామిదొరతో పాటు మరికొందరు ఆర్థిక సాయం చేశారు. అనుకున్నట్లే బంగారు పతకాలతో తిరిగి వస్తుండడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అశ్వారావుపేట వీకేడీవీ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండతోగు గ్రామానికి చెందిన తుర్సం నాగదుర్గారావు అనే గిరిజన యువకుడు గోవాలో జరిగిన ఇదే ఛాంపియన్ షిప్ లో ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బంగారు పతకాల పంట పండించిన గిరిజన యువ క్రీడాకారులను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు ఎంపికై దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
- Tags
- gold medals