నడిరోడ్డుపై బట్టలు చింపుకొని మరీ దారుణంగా కొట్టుకున్న మహిళలు.. (వీడియో)

by Hamsa |
నడిరోడ్డుపై బట్టలు చింపుకొని మరీ దారుణంగా కొట్టుకున్న మహిళలు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది చిన్న చిన్న కారణాల వల్ల ఇతరులపై కోపం తెచ్చుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఎక్కువగా మహిళలే గొడవలు పెట్టుకుని చుట్టూ ఎవరు ఉన్నారు అని కూడా మర్చిపోయి జుట్టు పట్టుకుని మరీ అతి దారుణంగా కొట్టుకుంటున్నారు. తాజాగా, అమెరికాలోని ఓ నైట్ క్లబ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికా, టెక్సాస్‌లోని సాన్‌ ఆంటోనియా నైట్‌ క్లబ్‌ వద్ద అర్థ రాత్రి కొంత మంది మహిళల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని రోడ్డుపై పడి దుస్తులు విప్పుకుని మరీ కొట్టుకున్నారు. దీంతో అది గమనించి సెక్యూరిటీ ఆఫీసర్లు, మరికొంతమంది వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా ఆ మహిళలు ఎంతకూ గొడవను ఆపలేదు. ఈ నేపథ్యంలోనే ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ క్రూరంగా ప్రవర్తించాడు. ఓ మహిళను పైకి ఎత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా మరో మహిళ కంట్లోకి పెప్పర్‌ స్ప్రే కొట్టాడు. వారు అంతలా కొట్టుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story