VIRAT-ANUSHKA: వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ కొడుకు ఫొటో.. వారెవ్వా అంటున్న నెటిజన్లు

by Shiva |   ( Updated:2024-02-22 06:57:35.0  )
VIRAT-ANUSHKA: వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ కొడుకు ఫొటో.. వారెవ్వా అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దంపతులు ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ క్రమంలో దేశం అంతటా అటు విరాట్ ఫ్యాన్స్.. ఇటు అనుష్క అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో హల్‌చల్ చేస్తున్నారు. అదేవిధంగా బాబుకు ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లుగా విరుష్క దంపతులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, విరాట్ తన వ్యక్తిగత గోప్యత పట్ల చాలా నిబద్ధతతో ఉంటాడు.

ఇప్పటి వరకు తన కూతరు ఫొటో కూడా బయటకు రానివ్వలేదంటే అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబానికి సంబంధించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)‌తో జనరేట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో విరాట్‌తో పాటు అనుష్క, కూతురు, కొడుకు అకాయ్ కూడా ఉన్నారు. ఆ ఫొటోలో అకాయ్ విరాట్ 18 నెంబర్ టీమిండియా జెర్సీ ధరించి ఉండటం విశేషం.

Advertisement

Next Story