- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: యాక్ థూ.. ఉమ్మితో మొహానికి మసాజ్ చేస్తున్న బార్బర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొందరు ఆకతాయిలు అడ్డూ అదుపు లేకుండా దిగజారిపోతున్నారు. వారు చేసే వికృత పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవి చూసినప్పుడు వారిని ఏం చేసినా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ సెలూన్‌కి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సెలూన్ షాప్‌లో పని చేస్తున్న ఓ బార్బర్ ఫస్ట్ నార్మల్ వైట్‌గా ఉన్న క్రీమ్‌తో మసాజ్ చేస్తున్నాడు. అలా చేస్తూ చేస్తూ కస్టమర్ వెనక్కి వచ్చి తన చేతిలో ఉమ్మి దానితో కస్టమర్‌కు మసాజ్ చేశాడు. అయితే సెలూన్ వర్కర్ స్వయంగా తన మొబైల్ ఫోన్ నుంచి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా 15 రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నౌజ్ పోలీసుల దృష్టికి ఈ వీడియో చేరుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ వీడియో నగరంలోని తాల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిబ్రమౌ కూడలికి సమీపంలో ఉన్న సెలూన్‌కి సంబంధించినది. ఈ వీడియోను 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ సెలూన్ బార్బర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సెలూన్ వర్కర్ షాపు మూసివేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
थूक वाली मसाज...
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) August 7, 2024
ये वीडियो यूपी में जिला कन्नौज की है...@Uppolice @kannaujpolice ऐसे जाहिल इंसान पर कार्रवाई करने का कष्ट करें...#Kannauj #UPNews #ViralVideo #Trending #UP #कन्नौज pic.twitter.com/hlsrlhKvWe
(video credits to nishantjournail X account)