Viral Video: వామ్మో ఇది దొంగ పాము.. ఏం ఎత్తుకెళ్లిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Kavitha |
Viral Video: వామ్మో ఇది దొంగ పాము.. ఏం ఎత్తుకెళ్లిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా అవుతున్న వాటిలో పాములకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. బేసిక్‌గా పాము ఏం చేస్తుంది. తనకు హాని కలిస్తున్నారని తెలిసిన వెంటనే కాటు వేసి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్లిపోతుంది. అదే పాము దొంగలా దొంగతనానికి వచ్చి తనకు కావాల్సిన వస్తువును తీసుకుని పోతే ఎలా ఉంటుంది. ఏంటి వింటుంటే విడ్డూరంగా అనిపిస్తుందా.. కానీ ఆ కోవకు చెందిన ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో తెగ హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

Dinesh Kumar అనే వ్యక్తి ట్వీట్ చేసిన వీడియో ప్రకారం.. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ పాము ఇళ్ల మధ్యలోకి వచ్చింది. దీంతో జనమంతా ఒక్కసారిగా భయపడి కేకలు పెట్టారు. అయితే అలా వచ్చిన ఆ పామును తరిమికొట్టడానికి కొందరు చెప్పులతో దాడి చేశారు. దీంతో వెంటనే ఆ చెప్పును నోట కరచుకుని పారిపోయింది. అక్కడున్న వారంతా ఎంత అరుస్తున్నా.. వెనక్కి చూడకుండా చెప్పును వదలకుండా ఒకటే పరుగు పెట్టింది. అక్కడే ఉన్న చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయింది. దీనతంటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ఈ పాము నిజంగానే దొంగపాము అంటూ కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు.. ఆ పాముకు అంతలా చెప్పు ఎందుకు నచ్చిందో ఆంటీ స్పందిస్తున్నారు.

(video link credits to dinesh kumar X account)

Advertisement

Next Story

Most Viewed