- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BSNL Recharge Plans: రీచార్జ్ చేయిస్తున్నారా? రూ.1కే అన్ లిమిటెడ్ ప్లాన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే
దిశ, వెబ్‌డెస్క్: బీఎస్ఎన్ఎల్ (BSNL) టెలికాం పరిశ్రమల ప్రభుత్వ ఆధీనంలో ప్రముఖ సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలతో పోల్చితే..బీఎస్ఎన్ఎల్ (BSNL) తన రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) లో ఎన్నో ప్రత్యేకతలను అందిస్తోంది. ఈ సంస్థ తన కస్టమర్లకు తక్కవ ధరకే ఎక్కువ వాలిడిటీ, డేటా, కాలింగ్ సర్వీసులను అందించే లక్ష్యంతోనే పనిచేస్తుంది.
బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్లలో 365 రోజుల నుంచి 425 రోజులపాటుసుదీర్ఘ వ్యాలిడిటీని అందించి..కస్టమర్లకు నిరంతరం సేవలను అందించేలా ప్లాన్ చేస్తోంది. జియో (Jio), ఎయిర్ టెల్ (Airtel), తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచినప్పటి నుంచి మిలియన్ల మంది కస్టమర్లు తక్కువ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్(BSNL) తన ప్లాన్స్ ధరలను పెంచలేదు. ఇంకా పాత ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది.
ఇక బీఎస్ఎన్ఎల్ (Bsnl) రూ. 321కి ఏడాది వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. దీనిలో 356 రోజులు వ్యాలిడిటీ ప్రతినెలా 15GB డేటా, ఫ్రీ కాలింగ్, 250 ఫ్రీ ఎస్ఎంఎస్(SMS) లు ఉంటాయి. రోజుకు రూ.1 కంటే తక్కువ ధరలో ఇది అందిస్తుంది. కానీ ఇది అందరూ ఉపయోగించుకోలేరు. ఈ ఆఫర్ కేవలం తమిళనాడు పోలీసుల కోసం అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ (BSNL) నెట్ వర్క్ లో ఉన్న ఫోన్ నెంబర్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతర నెట్ వర్క్ నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి 7 పైసలు, ఎస్టీడీ కాల్స్(STD Calls) నిమిషానికి 15పైసలు వసూలు చేస్తోంది.
కొత్త ఏడాది 2025 సందర్బంగా రూ. 2,399 ప్లాన్స్ ను మరింత మార్చింది బీఎస్ఎన్ఎల్. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 395 రోజుల చెల్లుబాటు 425 రోజులుగా పెరిగింది. 790GB డేటా ప్లేసులో 850GB డేటాను అందిస్తున్నారు. ఈ ప్లాన్స్ తీసుకున్న వినియోగదారులకు అదనంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ బెనిఫిట్స్ అన్నీ అందిస్తోంది. ఆ ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇక బీఎస్ఎన్ఎల్ మరో ఆఫర్ ను విడుదల చేసింది .రూ. 277తో రీఛార్జ్ చేస్తే 120GB, ఫ్రీ డేటా (Free Data) , అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్(Unlimited free calling) అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 16వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.