Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బొలేరోను ఢీ కొట్టి పేలిపోయిన బైక్

by Ramesh Goud |
Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బొలేరోను ఢీ కొట్టి పేలిపోయిన బైక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమబెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వేగంగా వస్తున్న ఓ బైక్ రోడ్డు దాటుతున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఘటన ప్రకారం కూచ్ బెహార్ లోని ప్రధాన రహదారిపై ఓ బొలేరో వాహనం రోడ్డు దాటుతుంది. అదే సమయంలో మెరుపు వేగంతో వచ్చిన ఓ ద్విచక్రవాహానం ఈ బొలేరో ఢీ కొట్టింది. ఈ వేగానికి ఒక్కసారిగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ప్రమాద దృష్యాలు హైవేపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ప్రకారం ఈ ఘటన అక్టోబర్ 11న జరిగిందని, ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed