- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VIRAL VIDEO: ఫస్ట్ టైమ్ డ్రోన్‌ను చూసిన బుడ్డోడు.. నెట్టింట ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో డాన్స్, స్టంట్స్, ఫైటింగ్ అలా వివిధ రకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా ఈ మధ్య ఫుల్ వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే కొన్ని మాత్రం పన్నీగా ఉంటాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
బేసిక్‌గా డ్రోన్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు కూడా వెళ్లి అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడంలో మనకు బాగా యూజ్‌ఫుల్ అవుతున్నాయి. అయితే సిటీల్లో ఉన్నవారు అయితే నిత్యం ఎక్కడో ఓ చోట ఇవి కనిపిస్తూనే ఉంటాయి. గ్రామాల్లో అయితే కాస్త తక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఈ బుడ్డోడు చూడటం మొదటి సారి అనుకుంటా. డ్రోన్‌ని చూడగానే ఈ పిల్లోడు చేసిన పనికి కచ్చితంగా మీ ఫేస్ నుంచి స్మైల్ రాక మానదు. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.
CCTV IDIOTS అనే వీడియో ప్రకారం.. ముగ్గురు పిల్లలు ఒక చోట ఆడుకుంటూ ఉంటారు. సడెన్‌గా అక్కడికి ఓ డ్రోన్ వాళ్ల దగ్గరకు వచ్చి ఆగుతుంది. డ్రోన్ చూసిన పిల్లలు ఇదేదో వింత వస్తువులా ఉందని భయపడి పరుగులు పెడతారు. అందులో ఎర్ర చొక్కా వేసుకున్న కుర్రాడి వెనుక ఈ డ్రోన్ వెళ్తూ ఉండగా.. ఆ పిల్లాడు వెనక్కి చూసుకుంటూ పరిగెడుతూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్తాడు. అయితే అక్కడ ఇద్దరు మహిళలు కనిపించడంలో ఆ పిల్లోడు వాళ్ల దగ్గరకు వెళ్తూ ఉండగా.. డ్రోన్ ఆగిపోతుంది. ఈ సీన్ అంతా చూస్తే.. పాపం డ్రోన్ అంటే ఏంటో తెలియని ఆ పిల్లవాడు ఏదో భూతం తనను వెంబడిస్తున్నది భావించి పరుగులు పెడుతున్నది చూస్తే నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కాగా ఈ వీడియో కొద్ది సమయంలోనే లక్షల వ్యూస్‌లను కైవసం చేసుకుంది.
Village kids see a drone for the first time pic.twitter.com/KH0HlzdvdN
— CCTV IDIOTS (@cctvidiots) August 15, 2024
(video link credits to cctv idiots X account)