- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: రైలు స్లోగా నడిపారని ప్రయాణికుల ఆగ్రహం..కిటికీ అద్దాలు ధ్వంసం
దిశ, వెబ్ డెస్క్: స్పెషల్ రైలు(Special Train) ఆలస్యంగా వచ్చిందని ఆగ్రహించిన ప్రయాణికులు కిటికీ(Windows) అద్దాలు పగలకొట్టిన ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఘటన ప్రకారం జబల్‌పూర్(Jabalpur) సమీపంలోని మదన్ మహల్ రైల్వే స్టేషన్(Madhan Mahal Railway Station)కి రైలు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన కొందరు ప్రయాణికులు రైలు ఇంజన్ వైపు పరుగులు తీశారు. రైలు ఆలస్యంగా నడపడం పట్ల లోకో పైలట్లపై ఆగ్రహానికి గురయ్యారు.
ఇంజన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేయడమే గాక లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ లపై దుర్భాషలాడారు. రైలును పలు స్టేషన్లలో ఎక్కువగా నిలిపిఉంచడమే గాక నెమ్మదిగా తీసుకొచ్చారని అసహనానికి గురయ్యారు. దీనిపై తామేమి చేయలేమని చెబుతున్నా వినకుండా సిబ్బందిపై దాడికి యత్నించారు. ఇంజన్ తలుపు లాక్ చేసి ఉంచడంతో వారు దాడి నుంచి బయటపడ్డారు. ఇది గమణించిన అధికారులు రైలును వెంటనే స్టేషన్ నుంచి పంపించి ప్రయాణికులను అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్(Viral) గా మారింది.