Viral: న్యూ ట్రెండ్.. ప్రీ వెడ్డింగ్ షూట్‌లా.. ప్రీ ఫస్ట్ నైట్ షూట్(వీడియో)

by Kavitha |   ( Updated:2024-07-29 14:00:35.0  )
Viral: న్యూ ట్రెండ్.. ప్రీ వెడ్డింగ్ షూట్‌లా.. ప్రీ ఫస్ట్ నైట్ షూట్(వీడియో)
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి జనాలు మరింత దిగజారి పోతున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన తతంగాన్ని తీసుకొచ్చి నెట్టింట పెడుతున్నారు. అలాంటి వీడియోలు చూసినప్పుడు పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. బేసిక్‌గా ఇప్పుడు చాలా మంది పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వాగులు, వంకలు, గుట్టలు గట్రా తిరుగుతూ షూట్ చేసుకుంటున్నారు. అలాగే మ్యారేజ్ అయ్యాక పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని చేసుకోవడం చూస్తునే ఉంటాం కదా. మరి ఫస్ట్ నైట్‌ను కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం చూశారా? అసలు ఎప్పుడైనా విన్నారా?. తాజాగా, ఓ యువ జంట తమ శోభనం రాత్రిని వినూత్నంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఆ ఆలోచన రూపమే.. ప్రీ ఫస్ట్ నైట్ షూట్. శోభనం జరగాల్సిన గదిని అందంగా అలంకరించి.. కొన్ని దృశ్యాలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి ఒక యువ జంటకు శోభనమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రూమ్ అంతా బెలూన్లతో అందంగా ముస్తాబు చేశారు. ఫస్ట్ వరుడు ముసిముసి నవ్వులు ఒలికిస్తూ లోపలి కెళ్తున్నాడు. తర్వాత వధువు కూడా పాల గ్లాసు పట్టుకుని లోపలికి వెళ్తుంది. అక్కడ భర్తను చూసి సిగ్గుతో తలదించుకొని భర్త చేతికి పాల గ్లాస్ అందిస్తోంది. అక్కడితో ఆ వీడియో అయిపోతుంది. అది చూసిన నెటిజన్లు అయ్యో అప్పుడే వీడియో అయిపోయిందా.. ఏదో అవుతుంది అనుకుంటే సగంలోనే ఆపేసారేం ఫుల్ వీడియో పెట్టండి అని.. ఇంకొన్ని రోజులు ఆగితే లైవ్ కూడా పెడతారు కావొచ్చు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story