- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధులు ఉన్న అభివృద్ధి శూన్యం....
దిశ, చిన్నకోడూరు : నిధులున్న అభివృద్ధి పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చౌడారం మధిర గ్రామం ఎల్లమ్మజాల్లో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పథకం కింద ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. అందులో నుండి సుమారుగా రూ. 2 లక్షల 70 వేలతో పాఠశాలలో ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు బిగించి, మరమ్మతులు చేశారు. గతంలో నిర్మించిన టాయిలెట్స్ అధ్వాన్నంగా మారాయి. నిధులున్న టాయిలెట్స్ నిర్మించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో నిర్మించిన టాయిలెట్లలో కి విద్యార్థులు వెళితే విష జ్వరాలు వస్తున్నాయని, బయటకు వెళ్తే విష పురుగులు కరుస్తాయేమోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిధులు ఉన్న నిర్మించని కాంట్రాక్టుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.