- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న గవర్నమెంట్ టీచర్.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో టీచర్ మసాజ్ చేయించుకుంటున్న షాకింగ్ ఘటన రాజస్థాన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం జైపూర్ ప్రాంతంలోని కర్తార్‌పూర్ ప్రభుత్వ హైయర్ ప్రైమరీ స్కూల్ లో ఓ టీచర్ నేలపై పడుకొని ఉండగా.. ఇద్దరు విద్యార్ధులు ఆమె కాళ్లపై నిలబడి మసాజ్ చేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చదువు చదివి గవర్నమెంట్ ఉద్యోగం సాధించి చిన్న పిల్లలతో కాళ్లు తొక్కించుకోవడానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలని మండిపడుతున్నారు. పిల్లలను ప్రయోజకులను చేయడానికి తల్లిదండ్రులు స్కూల్‌కు పంపిస్తుంటే.. వీళ్లు బానిసలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ అంజు చౌదరి స్పందిస్తూ.. తాను కూడా వీడియో చూశానని, అయితే ఈ నిర్దిష్ట సంఘటన గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. అంతేగాక మేడమ్ అనారోగ్యంతో ఉండవచ్చని, అందుకే ఆమె పిల్లలను సహాయం చేయమని అభ్యర్థించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంలో నిజనిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడతామని చెప్పినట్లు తెలిసింది.