Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్.. నీళ్ల ట్యాంకు మీద పడినా సురక్షితంగా మహిళ

by Ramesh Goud |   ( Updated:2024-10-14 07:45:07.0  )
Viral: అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్.. నీళ్ల ట్యాంకు మీద పడినా సురక్షితంగా మహిళ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదృష్టం వెంట ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా పక్కకు తప్పుకొని పోతుందని చెబుతుంటారు. ఇలాంటి ప్రమాదం నుంచే ఓ మహిళ సురక్షితంగా బయటపడి ప్రాణాలు నిలుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం ఓ మహిళ యాపిల్ తినుకుంటూ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అకస్మాత్తుగా పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ వచ్చి ఆ మహిళపై పడింది. ఇది చూసిన అందరూ ఆ మహిళ కచ్చితంగా ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆమె యాపిల్ నములుతూ ట్యాంకులో నుంచి లేచి చూడటం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అదృష్టం అంటే ఆమెదేనని.. ఆ మహిళ అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉందని అంటున్నారు. మరికొందరు ప్రాణాల మీదికి వచ్చినా యాపిల్ తినడం ఆపట్లేదని, రోజుకో యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటే ఇదేనేమోనని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed