Viral Video : తాగిన మైకంలో నాగుపాముతో నాటకాలు.. దాంతో పెట్టుకుంటే మాములుగా ఉంటదా..

by Kavitha |
Viral Video : తాగిన మైకంలో నాగుపాముతో నాటకాలు.. దాంతో పెట్టుకుంటే మాములుగా ఉంటదా..
X

దిశ, ఫీచర్స్: తాగిన మైకంలో చాలామంది ఏం చేస్తున్నామనే సోయి కూడా లేకుండా ఉంటారు. కొంత మంది అయితే తప్ప తాగి రోడ్ల మీదకు వచ్చి ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలా చేస్తారు. మరికొంత మంది తమ మాటలతో ఇబ్బంది కలిగిస్తారు. అయితే మనుషులంటే తాగి ఉన్నాడని అర్థం చేసుకుంటారు. కానీ సరీసృపాలకు ఎలా తెలుస్తుంది అతను తాగి ఉన్నాడని. మనం నార్మల్ స్థితిలో ఉండి వాటికి హాని కలిగించకపోయినా కనీసం మన వల్ల ఇబ్బంది ఉందంటేనే అవి మన మీదకు దాడి చేస్తాయి. మరి అలాంటిది కావాలని పోయి పోయి దానికి కోపం వచ్చేలా దానితో బిహేవ్ చేస్తే ఊరుకుంటదా.. చీల్చి చెండాడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఆ కోవకు చెందినదే.. వివరాల్లోకి వెళితే..

తాగిన మైకంలో ఓ యువకుడు ఏకంగా విషసర్పంతో ఆటలాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన పుట్టపర్తి సత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మందుబాబులకే కాదు మామూలు మనుషులకు కూడా మతిపోగొడుతోంది.

బేసిక్‌గా మనకు పాము కనిపిస్తే చాలు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా పరుగులు పెడతాము. కాని రోడ్డుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతుంటే అటుగా వెళ్తున్న నాగరాజు అనే యువకుడు మాత్రం మద్యం మత్తులో దాంతో ఆటలాడాడు. అందరూ చూస్తున్నారని మరింత ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో కోపం వచ్చిన పాము ఈ యువకుడిని కాటు వేసింది. ప్రస్తుతం నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మందుబాబు రోడ్డుపై పాముతో ఆటలాడటం కొందరు సెల్ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు ఈ యువకుడిని ఏకి పారేస్తున్నారు. అలాగే పాము జోలికి పోతే మామూలుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




Advertisement

Next Story