Trending: ప్రమాదకరమైన విష సర్పంతో అడవి పిల్లి పోరాటం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-05-18 12:04:11.0  )
Trending: ప్రమాదకరమైన విష సర్పంతో అడవి పిల్లి పోరాటం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పోరాడితే పోయేదేముంది.. అనుకుందో ఏమో ఓ అడవి పిల్లి తన ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద సహసమే చేసింది. ఏకంగా ప్రమాదకరమైన విష సర్పంతో చేసిన పోరాటం చేసిన స్ఫూర్తి.. నిజ జీవితంలో కష్టాల కడలిని ఈదేందుకు గొప్ప ఇన్‌స్పిరేషన్‌గా మారింది. ఓ అడవిలో పిల్లి తన దారిలో అది వెళ్తుండగా.. ఓ పాము అడొచ్చింది. దీంతో రెప్పపాటులో ఆ పాము పిల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తన బలాన్ని అంతా కూడగట్టుకుని ఆ అడవి పిల్లి పాముపై పంజాతో విరుకుపడింది. పడుతూ లేస్తూ.. చివరకు అంతిమ పోరాటంలో పామును మట్టి కరింపించింది. అయితే, అందుకు సంబంధించిన వీడియోను ‘నేచర్ ఈస్ అమేజింగ్’ ఓ నేచర్ లవర్ తన ఆఫీషియల్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

Next Story