- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: రెండో రోజే సభలో ఫైర్ అయిన స్పీకర్ ఓం బిర్లా.. నాకు సలహాలు ఇవ్వొద్దంటూ కామెంట్
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ 18వ లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన మూజువాణి ఓటు ద్వారా ఇండియా కూటమి అభ్యర్థి కే.సురేష్‌పై విజయం సాధించి స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఓం బిర్లా ప్రమాణం చేసిన మొదటి రోజే పార్లమెంట్‌లో ఎమర్జెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి రోజులుగా అని అభివర్ణించారు. అయితే, ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ బీజేపీ ఎజెండాను నడుపుతున్నారని విమర్శించారు.
దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాగా, గురువారం కూడా స్పీకర్ ఓం బిర్లా సభ్యులపై గరం అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ‘జై రాజ్యాంగం’ అంటూ నినాదం చేశారు. అందుకు స్పీకర్ ‘మీరు ఇప్పటికే రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కాబట్టి ఆ నినాదం చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా మరో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా లేచి అందుకు మీరు అభ్యంతరం చెప్పకూదని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బీర్లా దీపేదర్ హుడాకు కౌంటర్ ఇచ్చారు. ‘నాకు సలహాలు ఇవ్వకు.. చలో బైటో అంటూ ఫైర్ అయ్యారు.