Trending: వరంగల్ రోడ్లపై శివంగి.. ఏకంగా చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ హల్‌చల్ (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-20 03:48:49.0  )
Trending: వరంగల్ రోడ్లపై శివంగి.. ఏకంగా చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ హల్‌చల్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి అమ్మాయిలు, అబ్బాయిల కంటే తామేమి తక్కువ కాదంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. అనితర సాధ్యమైన ఫీట్లను కూడా ఇచ్చే చేసేస్తూ.. అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. సాధాణంగా అమ్మాయిలు ఏదైనా టూ వీలర్ నడిపేటప్పుడు కుర్తా, పైజామా లేక జీన్స్, టీషర్ట్ ధరించడం సర్వ సాధారణం. కానీ, అందుకు భిన్నంగా ఓ లేడీ చీరకట్టుతో ఏకంగా స్పోర్స్‌ బైక్‌ను వరంగల్ పట్టణంలో రయ్.. రయ్‌మంటూ నడిపేస్తోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది. అయితే, ఆ వీడియోలో స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేసిన ఆ లేడీ ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద ఆగింది. పిస్తా క‌ల‌ర్‌ చీర అందుకు మ్యాచింగ్ గాజులు కూడా వేసుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. ఓ అందమైన హెల్మెట్ కూడా ధరించిందండోయ్.

Advertisement

Next Story