Trending: భార్య అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన భర్త.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Shiva |   ( Updated:2024-10-09 08:32:19.0  )
Trending: భార్య అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన భర్త.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్/గండిపేట్: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు (ACB Officials) వరుసగా దాడులు చేస్తూ.. అవినీతికి పాల్పడుతోన్న అధికారుల భరతం పడుతున్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కాగా.. స్కెచ్ వేసి లంచగొండుల ఆటలు కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ అధికారి లంచావతారాన్ని భర్తే బయటపెట్టిన ఘటన హైదరాబాద్‌ (Hyderabad)లోని మణికొండ (Manikonda) ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ (Manikonda Municipality) పరిధిలో దివ్య, డీఈఈగా విధులు నిర్వర్తిస్తోంది. వచ్చిన జీతం చాలదు అన్నట్లుగా నిత్యం కార్యాలయంలో అవినీతికి పాల్పడుతూ.. భారీగా లంచం డబ్బును ఇంటికి తీసుకొస్తుందని ఆమె భర్త శ్రీపాద్ ఆధారాలతో సహా బయటపెట్టాడు.

పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో తీసుకున్న డబ్బును భార్య ఇంట్లో లేని సమయంలో ఎక్కడెక్కడ దాచిపెట్టిందో వెతికి మరీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఆ వీడియోలో అతడు తమ ఇంట్లో ఎక్కడ చూసినా.. నోట్ల కట్టలే కనిపిస్తున్నాయని అన్నాడు. భార్య తన తమ్ముడికి ఇప్పటికే రూ1.1 కోట్ల లంచం డబ్బును అప్పుగా ఇచ్చిందని ఆరోపించాడు. తన పద్ధతి మార్చుకోవాలని కొన్నాళ్ల నుంచి భర్త, దివ్యను హెచ్చరించినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సాక్ష్యాలతో సహా భార్య అవినీతి బండారాన్ని సోషల్ మీడియా వేదిక బయట పెట్టాడు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story