Trending: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఫోన్‌పే, గూగుల్ పే

by Shiva |
Trending: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఫోన్‌పే, గూగుల్ పే
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జూలై 1న కరెంటు బిల్లుల చిల్లింపులను థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చేల్లించే ప్రక్రియను నలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నార్త్, సౌత్ డిస్కమ్‌లు తాజాగా భారత్ బిల్ పేమెంట్ సర్వీసులో యాడ్ అవ్వడంతో బిల్లలు చెల్లింపునకు థర్డ్ పార్టీ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పేలను ఇక నుంచి వినియోగించవచ్చు. కాగా, ప్రతి బిల్లు చెల్లింపుపై రూ.2తో పాటు (జీఎస్టీతో కలిపి) డిస్కమ్‌లు ఎన్‌పీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామంతో ప్రతి నెలా రూ.1.5 కోట్ల మేర నార్త్, సౌత్ డిస్కంలపై అదనపు భారం పడనుంది. ఈ మేరకు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో TGSPDCL, TGNPDCL యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. లేని పక్షంలో tgsouthpower.org /tgnpdcl.com వెబ్‌సైట్లను సంప్రదించి బిల్లలను చెల్లించేందుకు అవకాశం ఉంది.

Advertisement

Next Story