Trending: బొప్పాయిలో దర్శనమిచ్చిన వినాయకుడు.. వింతను చూసేందుకు క్యూ కట్టిన భక్తులు

by Shiva |   ( Updated:2024-09-10 16:54:27.0  )
Trending: బొప్పాయిలో దర్శనమిచ్చిన వినాయకుడు.. వింతను చూసేందుకు క్యూ కట్టిన భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యం ధూప దీప నైవేద్యాలతో భక్తులు ఆ గణనాథుడుని కొలుస్తూ తమ కోర్కెలు తీర్చమంటూ వేడుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సారగపేటలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో ఉన్న బొప్పాయి చెట్టుకు (Papaya Tree) కాసిన మొదటి కాయను గణేషుడికి (Lord Ganesh) నైవేద్యం పెట్టేందుకు తీసుకెళ్లాడు. పూజ ముగిసిన అనంతరం ప్రసాద వితరణ సమయంలో బొప్పాయిని కోయగా అందులో వినాయకుడి రూపం దర్శనమిచ్చింది. ఈ విషయం ఈ నోట.. ఆ నోట పాకి చివరకి చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది. ఆ వింతను చూసేందుకు జనం పెద్ద ఎత్తున సాగరపేటకు తరలివస్తున్నారు.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1833515580915150890

Advertisement

Next Story

Most Viewed