- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: అసలు మీకు బేసిక్ సెన్స్ ఉందా..? హీరో నవదీప్ సంచలన వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో క్యాష్ పేమెంట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు.
క్యూ ఆర్ కోడ్స్, వెబ్ లింకులతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుని సైలెంట్‌గా చెక్కేస్తున్నారు. మరికొందరు కేటుగాళ్లు ఎలాంటి కండీషన్లు లేకుండా లోన్లు ఇస్తామని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మబలికి జనాలను నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నవదీప్ సైబర్ క్రైంపై సంచలన వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో ‘మీ పేరు మీద ఓ కొరియర్ తైవాన్ వెళుతోంది. అందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయ్.. మీకు రిస్క్ అంటూ ఒకడు ఫోన్ చేస్తాడు. మరొకడు టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ డిస్‌కనెక్ట్ అవ్వబోతోందని ఓ అమ్మాయి కాల్ చేసింది. అరేయ్..! సైబర్ క్రైం స్కామ్‌గాళ్లారా.. మీరు స్కాం చేద్దామనుకుంటున్నారు.. అందుకు మీరు ఫోన్ చేస్తున్నారు, అందుకు భయపడి మేం డబ్బలిచ్చేస్తామని మీ ఆశ. ఓకే అది మీ జాబ్.. కానీ బేసిక్ సెన్స్ లేకుండా అసలు మీరు ఫోన్ చేస్తున్న వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కనుక్కోండి.. ఊరికే యూజ్‌లెస్! అంటూ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1826888112737333349