- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shocking Video: రైలులో ఆదమరిస్తే అది హాంఫట్..!

దిశ, వెబ్ డెస్క్: రైలు(Train)లో చాలా మంది ప్రయాణికులు(Passengers) ప్రయాణం చేస్తుంటారు. సొంత ఊరికి, అవసరాల కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. కొంతమంది అయితే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణికుల్లో కొందరు వాళ్ల చేతికి పని చెబుతుంటారు. నిద్ర పోతున్న వారిని టార్గెట్ చేసి ఎంచక్కా పని కానిచ్చేస్తారు. ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రన్నింగ్ ట్రైన్‌లో యువ ప్రయాణికుడు అప్పర్ బెర్త్‌పై నిద్రపోతున్నారు. మరో యువకుడు పైకి ఎక్కి అటూ ఇటూ చూశాడు. ఎవరు తనను గమనించకపోవడంతో బెర్త్‌పై పడుకున్న వ్యక్తి జేబులో నుంచి సెల్ ఫోన్(Cell Phoneను కొట్టేశాడు. ఇది నిజంగా జరిగిందో.. వ్యూస్ కోసం చేశారో తెలియదు గాని.. ఈ వీడియో మాత్రం ప్రయాణికులకు అలర్ట్ చేస్తోంది. రైలు ఎక్కినప్పుడు చోరుల పట్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.