టాయిలెట్ పేపర్ కోసం బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన యువతి!

by Anjali |
టాయిలెట్ పేపర్ కోసం బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన యువతి!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో యువతి, యువకులు ప్రేమలో పడటం.. చిన్న చిన్న కారణాలతోనే విడిపోవడం కామన్ అయిపోయింది. ప్రేమకు బ్రేకప్ చేప్పడానికి కాదేది కారణం అనర్హం అన్న విధంగా ఎంతోమంది జనాలు వ్యవహరిస్తుండటం ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఊహించని కారణాలతో లవ్ బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి కారణాలకు కూడా లవర్స్ బ్రేకప్ చెప్పుకుంటారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఘటనే ఓ యువతి విషయంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. ‘‘ యూఎస్ కు చెందిన మేరియా కార్ల అనే యువతి టాయిలెట్ పేపర్ కోసం తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేక్ చెప్పింది. అయితే తన ప్రియుడి ఇంటి బాత్రూంలో టాయిలెట్ పేపర్ లేదట. అతడ్ని కొనమని చాలా సార్లు చెప్పిన తను మర్చిపోయానని చెప్పి తప్పించుకునేవాడట. కాగా ఇద్దరు కలిసి ఇటీవల షాపింగ్ వెళ్లగా.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ను టాయిలెట్ పేపర్ కొనమంటే అతను ససేమిరా అన్నాడట. తాను వైట్ వైప్స్ మాత్రమే యూజ్ చేస్తానని, టాయిలెట్ పేపర్ అస్సలు కొననంటే కొనను అన్నాడట. దీంతో ఆ యువతికి తీవ్రంగా కోపం వచ్చి అతనికి లవ్ బ్రేకప్ చెప్పేసిందట’’. యువతి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘‘వామ్మో ఇలాంటి కారణాలకు కూడా విడిపోతారా? అంటూ ముక్కుపై వేలేసుకుంటున్నారు జనాలు. మరికొంతమంది ఎవరిని ప్రేమించకపోవడమే బెటర్ అంటూ నేటి యువత కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed