Viral Video:స్టంట్స్ చేసిన యువకుడు..బైక్ ను తుక్కుతుక్కు చేసిన స్థానికులు!

by Jakkula Mamatha |
Viral Video:స్టంట్స్ చేసిన యువకుడు..బైక్ ను తుక్కుతుక్కు చేసిన స్థానికులు!
X

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల చాలా మంది యువకులు బైక్ పై రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. హైవే పై రీల్స్ చేస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను కారు ఢీ కొట్టిన ఘటన మరువక ముందే మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు సమీపాన ఓ ఇంట్రెస్టింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం బైక్స్ పై స్టంట్స్ చేస్తోన్న పోకిరీలను స్థానికంగా ఉండే ప్రజలు వినూత్నంగా శిక్షించారు. బెంగళూరుకు సమీపంలోని తుమకూరు నేషనల్ హైవే ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు తన స్కూటీతో స్టంట్స్ చేస్తూ ప్రమాదకరంగా నడిపారు. ఇది గమనించిన స్థానికులు యువకుడికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. ఫ్లైఓవర్‌పై నుంచి స్కూటీని కిందకి పడేసి మరోసారి ఇలా చేయకుండా శిక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story