బిర్యానీలో ప్రత్యక్షమైన ఉంగరం.. ఆ రింగ్‌తో కస్టమర్ ఏం చేశాడో తెలుసా?

by Anjali |
బిర్యానీలో ప్రత్యక్షమైన ఉంగరం.. ఆ రింగ్‌తో కస్టమర్ ఏం చేశాడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: బిర్యానీ అనగానే చాలా మంది లొట్టలేసుకుంటూ తినేవారు 99 శాతం మంది ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికైతే ప్రతి రోజూ బిర్యానీ తిన్నా బోర్ కొట్టదు. అయితే కొంతమంది ఆకలితో లేదా మద్యం మద్యం మత్తులో ఏం చూసుకోకుండా బిర్యానీని లాగించేస్తుంటారు. కొన్ని సార్లు మనకు తెలియకుండా మన ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టే వస్తువులు కూడా ఫుడ్ లో వస్తుంటాయి.

తాజాగా పెద్దపల్లి జిల్లాలోని బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కు ఇదే సంఘటన ఎదురైంది. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో ఓ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన బిర్యానీలో ఉంగరం కూడా కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. దీనిపై వినియోగదారులు హోటల్‌ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ కాస్త ఆందోళన జరిగింది.

ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ వారు తగిన చర్యలు తీసుకోవాలని, వంట మాస్టర్ కారణంగా లేదా సరైన పరిశుభ్రత పాటించడకపోకపోవడంతోనే ఇలా జరిగిందని, మంథని మున్సిపల్ అధికారులు బిర్యానీలో వచ్చిన ఉంగరంపై ఆరా తీసి రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మరికొంతమంది మరీ ఆ రింగ్ బంగారమా? లేక వెండినా? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story