విద్యార్థితో కలిసి ఐటెం సాంగ్‌కు చిందులేసిన లేడీ ఉపాధ్యాయురాలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

by Anjali |
విద్యార్థితో కలిసి ఐటెం సాంగ్‌కు చిందులేసిన లేడీ ఉపాధ్యాయురాలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ప్రస్తుత రోజుల్లో వారి ప్రవర్తన మితిమీరిపోతుంది. గురువులే తప్పు దారి పడుతున్నారు. విద్యార్థినులపై లైంగిక దాడి చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఒకప్పుడు టీచర్స్.. వచ్చామా? విద్యార్థులకు విద్యాభోధనలు చెప్పామా? వెళ్లిపోయమా? అన్నట్లుగా ఉండేది. ఒకరిద్దరూ టీచర్లు మాత్రమే విద్యార్థులతో కాస్త స్నేహంగా మెలిగేవారు తప్ప.. మిగతా వారంతా చాలా స్ట్రిక్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.

రీసెంట్ గా ఓ లేడీ ఉపాధ్యాయురాలు.. 10 వ తరగతి పిల్లాడితో రొమాంటిక్ ఫొటో షూట్ చేసి.. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. తాజాగా ఒక పాఠశాల విద్యార్థులు తమ క్లాస్ టీచర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎంతో గ్రాంగ్ గా నిర్వహించారు. దీంతో ఎంతో ఎగ్జైట్ అయిన మహిళ ఉపాధ్యాయురాలు.. తాను టీచర్ అనే విషయం మర్చిపోయి.. విద్యార్థులతో కజ్రా రే అనే హిందీ ఐటెమ్ సాంగ్ పై స్టెప్పులేసింది.

ఆమె డాన్స్ చేస్తుండగా.. ఓ అబ్బాయి తనపై రెడ్ కలర్ చున్నీ కప్పాడు. పిల్లలతో చేసిన సరదా అంతా సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘పిల్లలకు మంచి చెప్పాల్సింది పోయి, ఒక ఐటెం సాంగ్ కు డాన్స్ వేస్తావా? క్లాస్ రూం లో చిందులు వేయడమేంటి? తరగతి గదిలో పిల్లలతో డ్యాన్స్ చేయడం పద్ధతి కాదు, దీన్ని బట్టి చూస్తే టీచర్ ఎంతో ఓపెన్ మైండెడ్ గా ఉందో తెలుస్తోంది’. అంటూ నెటిజన్లు మహిళ ఉపాధ్యాయురాలిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story