- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొరియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన కిరణ్
దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక షట్లర్, యువ ఆటగాడు కిరణ్ జార్జ్ సత్తాచాటుతున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో వరుసగా రెండో రౌండ్‌లోనూ నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో 3వ సీడ్, చైనీస్ తైపీ ప్లేయర్ చి యు జెన్‌ను చిత్తు చేశాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ను 21-17, 19-21, 21-17 తేడాతో పోరాడి గెలుచుకున్నాడు. ఆరంభం నుంచే కిరణ్ పోరాటాన్ని నమ్ముకున్నాడు. తొలి గేమ్‌లో ఒక దశలో 11-9తో వెనుకబడిన అతను అనంతరం పుంజుకుని మ్యాచ్‌లో శుభారంభం చేశాడు. అయితే, రెండో గేమ్‌లో అతనికి షాక్ తప్పలేదు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. అక్కడ కూడా ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయినప్పటికీ వెనక్కితగ్గని అతను వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 20-14తో పట్టు సాధించి మ్యాచ్‌ను ముగించాడు. గంటా 15 నిమిషాలపాటు మ్యాచ్ సాగడం గమనార్హం. క్వార్టర్స్‌లో కిరణ్ జపాన్ ప్లేయర్ తకుమా ఒబయాషితో తలపడనున్నాడు. ఇప్పటివరకు కొరియా మాస్టర్స్‌లో ఏ భారత ఆటగాడు టైటిల్‌ను గెలవలేదు. కిరణ్ క్వార్టర్స్‌కు చేరుకుని టైటిల్ ఆశలు రేపాడు.