Ap Assembly: విశాఖ మెట్రో రైలు పనులపై కీలక అప్ డేట్

by srinivas |   ( Updated:2024-11-22 11:26:07.0  )
Ap Assembly: విశాఖ మెట్రో రైలు పనులపై కీలక అప్ డేట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ మెట్రో రైలు పనుల(Visakha Metro Rail Works)పై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ(Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అంతకుముందుఅసెంబ్లీ(Assembly)లో విశాఖ మెట్రో రైలు పనులపై చర్చకు వచ్చింది. దీంతో ఆ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌పై స‌మ‌గ్ర ర‌వాణా ప్రణాళిక కేంద్రానికి పంపించామని చెప్పారు.

కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తామని నారాయణ తెలిపారు. 100 శాతం కేంద్రమే నిధులు భ‌రించేలా నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్రభుత్వం కోరినట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 46.2 కి. మీ ల‌తో మూడు కారిడార్ల నిర్మాణం జరుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారని వెల్లడించారు. ఆయా కారిడార్స్‌లో హనుమంతువాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో 8 మీటర్ల ఫ్లై ఓవర్, దానిపై మెట్రో నిర్మాణం చేయ‌మ‌ని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాల‌ని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed